మహారాష్ట్ర నుంచి తిరుమలకు...

ABN , First Publish Date - 2021-10-08T05:01:46+05:30 IST

బిడ్డ కోసం తల్లిదండ్రులు చేసుకున్న మొక్కు తీర్చుకునేందుకు ఓ కుటుంబం మహారాష్ట్ర నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరింది.

మహారాష్ట్ర నుంచి తిరుమలకు...
కాలినడకన తిరుమలకు వెళ్తున్న మహారాష్ట్రవాసులు

బిడ్డ కోసం తల్లిదండ్రుల పాదయాత్ర


ములకలచెరువు, అక్టోబర్‌ 7: బిడ్డ కోసం తల్లిదండ్రులు చేసుకున్న మొక్కు తీర్చుకునేందుకు ఓ కుటుంబం మహారాష్ట్ర నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరింది. హింగోలి జిల్లా గణేష్‌పూర్‌కు చెందిన ఏసు, ఆశ దంపతులకు పెళ్లయి 10 ఏళ్లు గడుసున్నా పిల్లలు కలగలేదు. తమకు పిల్లలు పుడితే తిరుమలకు కాలినడకన వస్తామని శ్రీవారిని మొక్కుకున్నారు. వీరికి రెండేళ్ల క్రితం కొడుకు పుట్టాడు. కుమారుడికి సాయిల్‌ అని పేరు పెట్టుకున్నారు. మొక్కు తీర్చుకునేందుకు 20 రోజుల క్రితం బంధువులైన కాంబ, మీనాలతో కలిసి ఏసు కుటుంబం తిరుమలకు కాలినడకన బయలుదేరింది. వీరు గురువారం మధ్యాహ్నం ములకలచెరువు చేరుకున్నారు. తమ గ్రామం నుంచి తిరుమలకు 900 కిలో మీటర్లకుపైగా ఉందని, మరో ఐదు రోజుల్లో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుంటామని ఏసు చెప్పారు. 

Updated Date - 2021-10-08T05:01:46+05:30 IST