స్విమ్స్‌లో గర్భిణులకు ఉచిత వైద్య సేవలు
ABN , First Publish Date - 2021-10-28T06:37:33+05:30 IST
తిరుపతిలోని స్విమ్స్ శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి సిటీ, అక్టోబరు 27: తిరుపతిలోని స్విమ్స్ శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ వై.ఎ్‌స.ఆర్. ఆరోగ్యశ్రీలో భాగంగా గర్భిణులకు వైద్యంతోపాటు మందులనూ అందిజేస్తామని పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చయ్యే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలను కూడా చేస్తామని వివరించారు. గర్భకోశ వ్యాధులు, గర్భకోశ క్యాన్సర్, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలనూ ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీతోపాటు ఈసీహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత, రైల్వే ఎ.పి.ఆర్.టి.సి తదితరులతోపాటు స్విమ్స్‌తో ఒప్పందం కలిగిన బీమా కంపెనీ కార్డులు కలిగిన వారికి ఈ ఉచిత వైద్య సేవలను అందిస్తామని ఆమె తెలిపారు. ఎటువంటి కార్డుల్లేని వారికి సైతం రూ.50 వేల లోపు వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని ఆమె వివరించారు.