ఎర్రచందనం కేసులో మరో నలుగురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-08-21T05:40:44+05:30 IST

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో మరో నలుగురు నింది తులను అరెస్ట్‌ చేసినట్లు వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు.

ఎర్రచందనం కేసులో మరో నలుగురి అరెస్ట్‌
పోలీసుల అదుపులో వున్న నిందుతులు

కేవీపల్లె, ఆగస్టు 20: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో మరో నలుగురు నింది తులను అరెస్ట్‌ చేసినట్లు వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ నెల 10వతేదీన మండలం లోని నూతనకాల్వ గ్రామ సమీపంలో అటవీప్రాతం నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ 23 మంది నిందితులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ప్రమేయమున్న ముగ్గురు అటవీశాఖాధికార్లు, ఫారెస్ట్‌ డ్రైవర్‌, ముగ్గురు నిందుతులను 12వ తేదీన అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇదే కేసులో ప్రమేయ మున్న మరో నలుగురిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. మండలంలోని మిన్నమరెడ్డిగారిపల్లె క్రాస్‌ వద్ద  ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు కేవీపల్లె ఎస్‌ఐ బాలకృష్ణ, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆ దారిలో ఆటోలో వస్తున్న తమిళనాడు రాష్ట్రం నల్లంపట్టు గ్రామానికి చెందిన ఎస్‌.అన్నాదొరై, రొంపిచెర్ల మండలం ఓబులవారిపల్లెకు చెందిన చెంబకూరు సురేష్‌, అటవీశాఖలో పనిచేస్తూ సస్పెండైన తిరుపతి శాంతినగర్‌కు చెందిన చింతమాకుల సత్యమూర్తి, ముత్యాలరెడ్డిపల్లి సమీపంలోని శాంతినగర్‌లో నివాసమున్న చింతల జగపతిబాబు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వెంటబడి పట్టుకు న్నారు. విచారణలో ఎర్రచందనం కేసు నిందితులుగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో పోలీస్‌ సిబ్బంది రవీంద్ర, అన్వర్‌, రాజేష్‌రెడ్డి, సురేష్‌, రాజా పాల్గొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 34 మంది నిందుతులను ఇప్పటికి అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ చూపిన సీఐతోపాటు కేవీపల్లె ఎస్‌ఐ బాలకృష్ణ, సిబ్బందిని డీఎస్పీ రవిమనోహరాచారి అభినందించారు. 

Updated Date - 2021-08-21T05:40:44+05:30 IST