రైతుసంఘం జిల్లా నాయకుడి హౌస్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-06-22T04:56:21+05:30 IST

రైతుసంఘం జిల్లా నాయకుడు టీఎల్‌. వెంకటేష్‌ను సోమవారం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

రైతుసంఘం జిల్లా నాయకుడి హౌస్‌ అరెస్ట్‌

కేవీపల్లె, జూన్‌ 21: రైతుసంఘం జిల్లా నాయకుడు టీఎల్‌. వెంకటేష్‌ను సోమవారం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తోతాపురి మామిడికి కిల్లో రూ.20 మద్దతుధర  కల్పించాలని  చలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు తిమ్మాపురం పంచా యతీ నారమాకులమిట్ట గ్రామంలో ఆయన ఇంటివద్ద ముందస్తు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం  మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2021-06-22T04:56:21+05:30 IST