విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

ABN , First Publish Date - 2021-10-20T04:50:17+05:30 IST

విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతిచెందాడు.

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
మృతిచెందిన గంగాధర్‌

పుంగనూరు రూరల్‌, అక్టోబరు 19: విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం పుంగనూరు మండలంలో జరిగింది. బండ్లపల్లె పంచాయతీ బుర్రావారిపల్లెకు చెందిన గంగాధర్‌(40) రైతు. ఇతడు తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మోటారు వద్దకు తీసిన విద్యుత్‌ వైర్ల నుంచి విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో వాటిని బాగుచేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2021-10-20T04:50:17+05:30 IST