మైనారిటీ స్కాలర్‌షిప్‌ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-10-29T06:43:54+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కోసం ఇచ్చే ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి చిన్నారెడ్డి కోరారు.

మైనారిటీ స్కాలర్‌షిప్‌ కోసం  ఇలా దరఖాస్తు చేసుకోండి

చిత్తూరు, అక్టోబరు 28:  కేంద్ర  ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కోసం ఇచ్చే ప్రీ మెట్రిక్‌,  పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి చిన్నారెడ్డి కోరారు. ఈ అంశంపై అవగాహన కార్యక్రమం గురువారం అంబేడ్కర్‌ భవన్‌లో జరిగింది. ఆర్‌ఐవో శ్రీనివాసులురెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం పాల్గొన్నారు.

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు సంవత్సరాదాయం లక్షలోపు ఉంటే.. వెయ్యి రూపాయల స్కాలర్‌షిప్‌ ఇస్తారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.ఐదు వేలను ఇస్తారు.

రెండు లక్షల్లోపు ఆదాయం కల్గిన కుటుంబాల్లోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల కింద రూ.12వేలను ఇస్తారు.

రూ.2.50 లక్షల్లోపు ఆదాయం కలిగి వృత్తి విద్య కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మెరిట్‌కమ్‌ మీన్స్‌ కింద రూ.25వేల నుంచి రూ.30వేల వరకు  సాయం అందిస్తారు.

 50శాతం మార్కులు పొందినవారే అర్హులు. 

ముందు తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రం, విద్యార్థుల పేరిట బ్యాంకు ఖాతా సిద్ధం చేసుకోవాలి. 

దరఖాస్తులు scholarships.gov.in అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Updated Date - 2021-10-29T06:43:54+05:30 IST