బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2021-02-07T05:21:56+05:30 IST
విద్యుత్ బిల్లుల బకాయిల వసూలు దృష్టి పెట్టాలని సదరన్ డిస్కం సీఎండీ హరనాథరావు ఆదేశించారు.

సదరన్ డిస్కం సీఎండీ హరనాథరావు
తిరుపతి(ఆటోనగర్), ఫిబ్రవరి 6: విద్యుత్ బిల్లుల బకాయిల వసూలు దృష్టి పెట్టాలని సదరన్ డిస్కం సీఎండీ హరనాథరావు ఆదేశించారు. శనివారం తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెలూరుజిల్లాల ఎస్‌ఈలు, ఈఈలతో సమీక్షించారు. గతనెలలో ప్రభుత్వ కార్యాలయాలనుంచి రావాల్సిన బకాయిలపై ఆరా తీశారు. బిల్లులు చెల్లించని వారికి తొలుత కౌన్సెలింగ్ ఇవ్వాలని, మారకుంటే రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా ఆస్తులు వేలం వేయాలన్నారు. అలాగే బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు లోడ్ సర్వీసులను గుర్తించి చార్జీలు వసూలు చేయాలని చెప్పారు. రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాన్ని వందశాతం అమలు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో తనకు నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడవచ్చని తెలియజేశారు. డైరెక్టర్లు వీఎన్ బాబు, పి.కళాధర్‌రావు, టి.వనజ, సీజీఎంలు సుబ్బరాజు, ప్రసాదరావు, హనుమత్‌ప్రసాద్, ఎస్‌ఈలు శ్రీనివాసులు, డీవీ చలపతి, ఆదిశేషయ్య, శివప్రసాద్‌రెడ్డి, వరకుమార్, ఈఈలు ఎం.కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రావు, వసురెడ్డి, ఐదు జిల్లాల ఈఈలు పాల్గొన్నారు.