రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
ABN , First Publish Date - 2021-03-22T05:19:22+05:30 IST
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుకు తీవ్రగాయాలై ఆస్పత్రికి తరలించగా తండ్రి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి కార్వేటినగరంలో జరిగింది.

కుమారుడికి తీవ్ర గాయాలు
వెదురుకుప్పం, మార్చి 21: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుకు తీవ్రగాయాలై ఆస్పత్రికి తరలించగా తండ్రి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి కార్వేటినగరంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... కార్వేటినగరం మండలం అన్నూరుకు చెందిన చిన్నమందడి(80), ఆయన కుమారుడు సుబ్రమణ్యం(54) ఆదివారం రాత్రి పుత్తూరు నుంచి స్వగ్రామానికి బైక్‌లో వెళ్తుండగా డైట్ సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురెదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చిన్నమందడి, సుబ్రమణ్యం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పుత్తూరు ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నమందడి మృతి చెందారని తెలిపారు.