వేరుశనగ సాగులో రైతులు బిజీ

ABN , First Publish Date - 2021-07-12T05:49:02+05:30 IST

ఖరీఫ్‌ పంటల సాగులో రైతులు బిజీగా వున్నారు. వేరుశనగ సబ్సిడీ విత్తనకాయలు కొని విత్తనాలు శుద్ధి చేసుకొని ఎదురు చూస్తున్న రైతులకు ఆరుద్ర కార్తెలోనే అవసరమైన మేర చినుకులు పడటంలో వ్యవసాయ పనులలో నిమగ్నమైపోయారు.

వేరుశనగ సాగులో రైతులు బిజీ
కాకిమారిపల్లె వద్ద వేరుశనగ విత్తనాలు వేస్తున్న రైతులు

పెద్దతిప్పసముద్రం, జూలై 11: ఖరీఫ్‌ పంటల సాగులో రైతులు బిజీగా వున్నారు. వేరుశనగ సబ్సిడీ విత్తనకాయలు కొని విత్తనాలు శుద్ధి చేసుకొని ఎదురు చూస్తున్న రైతులకు ఆరుద్ర కార్తెలోనే అవసరమైన మేర చినుకులు పడటంలో వ్యవసాయ పనులలో నిమగ్నమైపోయారు. పీటీఎం మండలంలో వేరుశనగ సాధారణ సాగు 15 వేల ఎకరాలు కాగా గత నాలుగైదు రోజులుగా 50 శాతం పైగా విత్తడం పూర్తయింది. వేరుశనగతో పాటు అంతర పంటలుగా టమోటా, కందులు, మొక్కజొన్నలను కొందరు రైతులు సాగు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనకాయలు సరఫరా చేసినప్పటికీ డీఏపీ, కాంప్లెక్స్‌ అవసరమైన మేరకు రాకపోవడంలో అధిక ధరలు చెల్లించి బహిరంగ మార్కెట్‌ లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అదే విధంగా ప్రతి ఆర్‌బీకే నుంచి పరిమిత సంఖ్యలో రైతులకు నేషనల్‌ ఫూడ్‌ సెక్యూరిటీ మిషన్‌ పథకం ద్వారా కందులను పంపిణీ చేశారు. దీంతో కందులను సైతం బయట కొనాల్సి వస్తోందని సంబంధిత అధికారులు స్పందించి ఎరువులు, కందులు సకాలంలో తెప్పించి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-07-12T05:49:02+05:30 IST