విద్యుదాఘాతంతో రైతు మృతి?

ABN , First Publish Date - 2021-10-14T05:33:55+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోట మండలంలోని సూరపువారిపల్లె పంచా యతీ నామాలపల్లెకు చెందిన జి.అంజనప్ప(41) రైతు. బుధవారం గ్రామ సమీపంలోని గుట్టలోకి వెళ్లాడు. అక్కడ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి?
మృతి చెందిన అంజనప్ప

బి.కొత్తకోట, అక్టోబరు 13: విద్యుదాఘాతంతో  రైతు మృతి చెందాడు.  పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోట మండలంలోని సూరపువారిపల్లె పంచా యతీ నామాలపల్లెకు చెందిన జి.అంజనప్ప(41) రైతు. బుధవారం గ్రామ సమీపంలోని గుట్టలోకి వెళ్లాడు. అక్కడ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిం చారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు అడవి జంతువుల కోసం తీసిన కరెంట్‌ ఉచ్చు తగులుకొని మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ విషయంలో గ్రామస్తులు నోరు మెదపలేదు. సంఘటనా స్థలంలో విద్యుత్‌వైర్లు లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే వైర్లను మాయం చేశారనే అనుమానం వ్యక్తమవుతోంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  కాగా అంజనప్పకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

Updated Date - 2021-10-14T05:33:55+05:30 IST