కొవిడ్‌ మృతుల కుటుంబాలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-10-29T06:44:51+05:30 IST

కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించేందుకు జేసీ (అ) నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

కొవిడ్‌ మృతుల కుటుంబాలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోండి

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 28: కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించేందుకు  జేసీ (అ) నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు నవంబరు 8లోపు మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దారుకు దరఖాస్తులు అందజేయాలన్నారు. డెత్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్‌ జతచేయాలి. 9వ తేదీ నుంచి కమిటీ దరఖాస్తులను పరిశీలిస్తుంది. 

Updated Date - 2021-10-29T06:44:51+05:30 IST