క్రీడా విజేతలకు సన్మానాలు

ABN , First Publish Date - 2021-12-07T05:47:14+05:30 IST

జాతీయస్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడాపోటీల్లో విజేతలైన జిల్లా క్రీడాకారులను సోమవారం కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సన్మానించారు.

క్రీడా విజేతలకు సన్మానాలు
సతీష్‌కుమార్‌ను అభినందిస్తున్న కలెక్టర్‌ తదితరులు

కుప్పం/చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 6: జాతీయస్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడాపోటీల్లో విజేతలైన జిల్లా క్రీడాకారులను సోమవారం కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సన్మానించారు. 2020-21 నేషనల్‌ యూత్‌ గేమ్స్‌ ఛాంపియన్‌షి్‌ప కబడ్డీ, లాంగ్‌జంప్‌, హైజంప్‌, వాలీబాల్‌ పోటీల్లో కుప్పం మండలం ఎన్‌.కొత్తపల్లెకు చెందిన ఇ. సతీ్‌షకుమార్‌ బంగారు పతకం సాధించాడు. ఇతను ఇంటర్నేషనల్‌ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. పోటీల్లో విశేష ప్రతిభ కనబరచిన ఇ. సతీష్‌ కుమార్‌, సి.రెడ్డప్పలను కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్‌ శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ జి. శ్రీనివాసులు, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:47:14+05:30 IST