ప్రతిఒక్కరూ భగవద్గీత పఠించాలి
ABN , First Publish Date - 2021-12-15T06:45:43+05:30 IST
ప్రతిఒక్కరూ భగవద్గీత పఠనం చేయాలని టీటీడీ ధర్మప్రచార మండలి జిల్లా సభ్యుడు రాజ్‌కుమార్ కోరారు.

శ్రీకాళహస్తి, డిసెంబరు 14: ప్రతిఒక్కరూ భగవద్గీత పఠనం చేయాలని టీటీడీ ధర్మప్రచార మండలి జిల్లా సభ్యుడు పోతుల రాజ్‌కుమార్ కోరారు. స్థానిక విద్యాజ్యోతి పాఠశాలలో మంగళవారం గీతా పారాయణం నిర్వహించారు. విద్యార్థులతో గోవింద భజనలు చేయించి, భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. శ్రీకృష్ణ చారిటబుల్‌ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలో గీతా జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిఽథి అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో భగవద్గీత మంచి పుస్తకమని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి, ఇస్కాన్ భక్తులు తులసినారాయణ దాస్, లక్ష్మీపతిరెడ్డి, మధురరెడ్డి, బలరామిరెడ్డి, బాలకృష్ణ, సుబ్బరామిరెడ్డి, విద్యాజ్యోతి కరస్పాండెంట్ సంయుక్తారెడ్డి, హెచ్‌ఎం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.