తొలి విడత పోలింగ్‌కు సిద్ధంకండి

ABN , First Publish Date - 2021-02-06T08:43:05+05:30 IST

తొలివిడత పంచాయతీ పోలింగ్‌కు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పిలుపునిచ్చారు.

తొలి విడత పోలింగ్‌కు సిద్ధంకండి
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో టీకా వేయించుకుంటున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

అధికారులకు కలెక్టర్‌ పిలుపు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 5: తొలివిడత పంచాయతీ పోలింగ్‌కు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటుచేసిన బృందాలు తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని చెప్పారు. సర్వీస్‌ ఓటర్ల జాబితా ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్లను ఎలాంటి తప్పొప్పులు లేకుండా అందించాలన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌కు ముందురోజు వరకు బ్యాలెట్‌ పత్రాలను భద్రపరచాలన్నారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్‌ నిర్వహణకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వ్యయ పరిశీలకుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసినకంట్రోల్‌ రూమ్‌కు అందే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జేసీలు మార్కండేయులు, వీరబ్రహ్మం, రాజశేఖర్‌, ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్వో మురళి, డీపీవో దశరథరామిరెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


వ్యాక్సినేషన్‌పై అపోహలు వీడండి 

చిత్తూరు రూరల్‌: అపోహలు వీడి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ ముందుకు రావాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం ఆయన వ్యాక్సిన్‌ వేయించుకుని మాట్లాడారు. జేసీ వీరబ్రహ్మం, డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ, డీఎంహెచ్‌వో పెంచలయ్య, ఆసుపత్రి ఎంఎస్‌ అరుణ్‌కుమార్‌, అపోలో యూనిట్‌ హెడ్‌ నరే్‌షకుమార్‌రెడ్డి, కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, వ్యాక్సినేషన్‌ అమలుపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కరోనా పరీక్షలు చేయాలన్నారు. 

Updated Date - 2021-02-06T08:43:05+05:30 IST