ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-11-09T05:38:23+05:30 IST

ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి అన్నారు.

ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఎస్పీ

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి 


చిత్తూరు లీగల్‌, నవంబరు 8: ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి అన్నారు. చిత్తూరులోని నూతన కోర్టు ప్రాంగణంలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ఎస్పీ సెంథిల్‌ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడుకి న్యాయం అందుబాటులోకి తెచ్చేందుకే ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పేద, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముందుంటుందన్నారు. లోక్‌అదాలత్‌లో పెండింగ్‌ కేసులే కాకుండా కోర్టు వరకు వెళ్లని కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఆజాది కా అమృత మహోత్సవ్‌ ద్వారా ప్రజలు ఉచిత న్యాయ సహాయం పొందేందు అవకాశం లభిస్తుందన్నారు. ఉచితంగా న్యాయసేవలు ఎలా పొందాలో వివరించారు. అనంతరం ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ర్టిక్‌ సెసన్స్‌ కోర్టు జడ్జి వెంకట హరినాథ్‌, ఆరవ అదనపు జిల్లా కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి, ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు జడ్జి సత్యప్రభాకరరావు, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ కరుణకుమార్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్యాంబాబు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు బీవీఎస్‌ రాణి, శాంతి, శ్రీనివాసులు, డీపీవో దశరదరామిరెడ్డి, దిశ డీఎస్పీ బాబుప్రసాద్‌, రోప్‌ స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ ధనశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:38:23+05:30 IST