ఉపాధ్యాయులు సీనియారిటీని ఆన్‌లైన్‌లో పొందుపరచండి: డీఈవో

ABN , First Publish Date - 2021-08-20T05:33:21+05:30 IST

ఉపాఽధ్యాయుల సీనియారిటీని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని డీఈవో పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో కోరారు.

ఉపాధ్యాయులు సీనియారిటీని ఆన్‌లైన్‌లో పొందుపరచండి: డీఈవో

చిత్తూరు సిటీ, ఆగస్టు 19: ఉపాఽధ్యాయుల సీనియారిటీని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని డీఈవో పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్ల ప్రమోషన్ల కోసం సీనియారిటీ జాబితా రూపొందించి జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఎంఈవో, డీవైఈవోలకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉపాధ్యాయులు ట్రెజరీ ఐడీలతో సీఎస్‌ఈ పోర్టల్‌లో గల టీచర్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ లాగిన్‌ అయి తమ వివరాలను పొందుపరచాలని సూచించారు. క్వాలిఫికేషన్స్‌/పాసైన పరీక్షల వివరాలు, డెమోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ను ఈనెల 25వ తేదీలోపు అప్‌డేట్‌ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏఎస్‌వో/ఏపీవోలను లేదా 9440077465, 8121388771 నెంబర్లను సంప్రదించాలని డీఈవో సూచించారు. 


Updated Date - 2021-08-20T05:33:21+05:30 IST