పుల్లయ్యగారిపల్లె వద్ద ఏనుగుల గుంపు తిష్ఠ

ABN , First Publish Date - 2021-03-22T05:02:58+05:30 IST

మండల పరిధిలోని నుంజర్ల ప్రాజెక్టు, తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా తిష్ఠ వేసిన తొమ్మిది ఏనుగుల గుంపు శనివారం తాళ్లమడుగు వైపునుంచి వరదరాజులపల్లె, యాదమరి మీదుగా పుల్లయ్యగారిపల్లె వద్ద ఉన్న అటవీప్రాంతానికి చేరుకున్నాయి.

పుల్లయ్యగారిపల్లె వద్ద ఏనుగుల గుంపు తిష్ఠ

యాదమరి, మార్చి 21: మండల పరిధిలోని నుంజర్ల ప్రాజెక్టు, తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా తిష్ఠ వేసిన తొమ్మిది ఏనుగుల గుంపు శనివారం తాళ్లమడుగు వైపునుంచి వరదరాజులపల్లె, యాదమరి మీదుగా పుల్లయ్యగారిపల్లె వద్ద ఉన్న అటవీప్రాంతానికి చేరుకున్నాయి. ఆదివారం అక్కడే ఉండడంతో అటవీశాఖ అధికారులు వాటిని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయంతో ఎవరూ పొలాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Updated Date - 2021-03-22T05:02:58+05:30 IST