ఏపీటీఎఫ్‌ చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2021-12-27T04:35:58+05:30 IST

ఏపీటీఎఫ్‌(ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌) జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఏపీటీఎఫ్‌ చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నిక
గోపినాథం , ముక్తార్‌ అహ్మద్‌

చిత్తూరు సిటీ, డిసెంబరు 26: ఏపీటీఎఫ్‌(ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌) జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం చిత్తూరులోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్‌ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడుగా కె.గోపినాథం, ఉపాధ్యక్షులుగా నరసింహారెడ్డి, ఓ.గురుమూర్తి, ఎం.రమేష్‌, నీలిమ, ప్రధాన కార్యదర్శిగా జి.ముక్తార్‌ అహ్మద్‌, కార్యదర్శులుగా ఎస్‌.అఫ్జల్‌ బాషా, సి.శ్రీహరి, కె.బాలసుబ్రహ్మణ్యం, డి.ప్రభాకర్‌, చంద్రశేఖర నాయుడు, రాష్ట్ర కౌన్సిలర్లుగా కె.గోపినాథం, జి.ముక్తార్‌ అహ్మద్‌, డి.జయరాం, యం.జగన్నాథం, బి.మురళీకృష్ణ, ఎన్‌ఎస్‌ శికశంకర్‌, ఆడిట్‌ కన్వీనర్‌గా కె.అక్తర్‌, ఆడిట్‌ కమిటీ సభ్యులుగా వాసుదేవయ్య, కె.వెంకటాద్రిని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంసుందర్‌రెడ్డి పరిశీలకుడుగా వ్యవహరించారు.

Updated Date - 2021-12-27T04:35:58+05:30 IST