కలెక్టరేట్‌లో ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-02-27T05:27:06+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల కోసం కలెక్టరేట్‌లో ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌లో ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: మున్సిపల్‌ ఎన్నికల కోసం కలెక్టరేట్‌లో ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ మేరకు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తి మినహా చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీలకు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జేసీ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 24 మంది అధికారులతో ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. త్వరలో ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిచేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - 2021-02-27T05:27:06+05:30 IST