రామకుప్పంలో మళ్లీ శబ్దాలు, భూప్రకంపనలు

ABN , First Publish Date - 2021-12-09T06:15:39+05:30 IST

రామకుప్పం మండలంలో అంతుచిక్కని శబ్దాలు, భూప్రకంపనల పరంపర కొనసాగుతోంది.

రామకుప్పంలో మళ్లీ శబ్దాలు, భూప్రకంపనలు
గడ్డూరు గ్రామంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన గ్రామస్తులు

రామకుప్పం, డిసెంబరు8: రామకుప్పం మండలంలో అంతుచిక్కని శబ్దాలు, భూప్రకంపనల పరంపర కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి మండల పరిధి గడ్డూరు, గెరిగెపల్లె, యానాదికాలనీ, కృష్ణానగర్‌, గొరివిమాకులపల్లె, పెద్దగెరిగెపల్లెల్లో నాలుగైదుమార్లు శబ్దాలు, భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి జాగారం చేశారు. పలుచోట్ల గోడలకు బీటలు రావడం, ఇళ్లలో వస్తువులు కిందకు దొర్లాయని వారు తెలిపారు. స్థానికంగా ఉన్న క్వారీల వల్ల శబ్దాలు, భూప్రకంపనలు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం అధికవర్షాల వల్ల భూమిలోపల జలాలు ఇంకుతుండటం వల్ల శబ్దాలు, భూప్రకంపనలు వస్తున్నాయని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో శబ్దాలు, భూప్రకంపనలకు అసలు కారణాలను శోధించి, భయాందోళనలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-12-09T06:15:39+05:30 IST