చెన్నై, వేలూరు వెళ్లాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-05-20T06:21:28+05:30 IST
తమిళనాడులోని చెన్నై, వేలూరు తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రిజిస్ర్టేషన్ తప్పనిసరి చేశారు.

చెన్నై, మే 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని చెన్నై, వేలూరు తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రిజిస్ర్టేషన్ తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు స్టాలిన్ ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం, శుభకార్యాలకు రావాలంటే ఈ రిజిస్ర్టేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు చూసీ చూడనట్టుగా వ్యవహరించినప్పటికీ పోలీసులు బుధవారం నుంచి నిబంధనలను కఠినతరం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వాహనాలను వెనక్కి పంపేస్తున్నారు. పొన్బాడి, నాగలాపురం, సత్యవేడు, ఊత్తుకోట, ఎళావూరు తదితర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి వైద్య సేవల కోసం రోగులను తీసుకొచ్చే వాహనాలు, అంబులెన్సులు కూడా ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు. లేకుంటే వెనక్కి పంపేస్తున్నారు. అదేవిధంగా వేలూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా పోలీసులు అదనపు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఈ పాస్ కోసం జ్ట్టిఞ://్ఛట్ఛజజీట్ట్ఛట.్టుఽ్ఛజ్చ.ౌటజ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.