ఐఐటీని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్‌

ABN , First Publish Date - 2021-08-22T05:16:41+05:30 IST

తిరుపతి ఐఐటీ ఏర్పేడు ప్రాంగణాన్ని శనివారం డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి సందర్శించారు.

ఐఐటీని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్‌
ఐఐటీ అధికారులతో డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి, ఎంపీ గురుమూర్తి

ఏర్పేడు, ఆగస్టు 21: తిరుపతి ఐఐటీ ఏర్పేడు ప్రాంగణాన్ని శనివారం డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి సందర్శించారు. ఇప్పటి వరకు ఐఐటీ ప్రాంగణంలో నిర్మించిన కళాశాల భవనాలు, హాస్టల్‌తో పాటు ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీవో చైర్మన్‌ ఇప్పటి వరకు ఐఐటీలో జరిగిన శాస్త్ర, సాంకేతిక పరిశోధనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐఐటీకి డీఆర్డీవో సహకారం ఉంటుందని తెలిపారు. మరిన్ని శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు జరపాలని ఐఐటీ అధికారులకు సూచించారు. ఈ పరిశోధనల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందని అన్నారు. డీఆర్డీవో  చైర్మన్‌ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఐఐటీ ప్రొఫెసర్లు ఉన్నారు.

Updated Date - 2021-08-22T05:16:41+05:30 IST