డి.ఫార్మశీ దరఖాస్తుకు నేడు ఆఖరు

ABN , First Publish Date - 2021-10-19T07:36:30+05:30 IST

రెండేళ్ల కాలవ్యవధితో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్‌ ఫార్మశీ (డి.ఫార్మశీ) కోర్సులో ప్రవేశానికి మంగళవారంతో గడువు ముగుస్తోందని తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్‌ ఫార్మశీ విభాగం హెడ్‌ గల్లా కృష్ణమూర్తినాయుడు పేర్కొన్నారు.

డి.ఫార్మశీ దరఖాస్తుకు నేడు ఆఖరు
మాట్లాడుతున్న ఫార్మశీ విభాగం హెడ్‌ కృష్ణమూర్తినాయుడు

తిరుపతి(విద్య), అక్టోబరు 18: రెండేళ్ల కాలవ్యవధితో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్‌ ఫార్మశీ (డి.ఫార్మశీ) కోర్సులో ప్రవేశానికి మంగళవారంతో గడువు ముగుస్తోందని తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్‌ ఫార్మశీ విభాగం హెడ్‌ గల్లా కృష్ణమూర్తినాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధితో పాటు ఫార్మసి్‌స్టగా ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ఈసెట్‌ ద్వారా బి.ఫార్మశీ రెండోఏడాది కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు. తమ కళాశాలలో 66 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్‌లో (రెగ్యులర్‌, ఓపెన్‌కాలేజ్‌, సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌ససీ) బైపీసీ, ఎంపీసీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండుసెట్ల జెరాక్స్‌కాపీలు, ఫొటోతో ఎస్వీ పాలిటెక్నిక్‌లోని ఫార్మశీ విభాగంలో సంప్రదించి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 98482 17166, 95536 29005 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కెమిస్ట్రీ హెడ్‌ గౌరీశంకర్‌, అధ్యాపకుడు రాజేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T07:36:30+05:30 IST