కేంద్రం బీసీలను విస్మరిస్తే ఉపేక్షించం: డేరంగుల

ABN , First Publish Date - 2021-11-09T05:44:21+05:30 IST

కేంద్రప్రభుత్వం బీసీల సమస్యలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదని ఏపీ బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌ హెచ్చరించారు.

కేంద్రం బీసీలను విస్మరిస్తే ఉపేక్షించం: డేరంగుల
బీసీ సంఘ నేతల సంఘీభావం

శ్రీకాళహస్తి, నవంబరు 8: కేంద్రప్రభుత్వం బీసీల సమస్యలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదని ఏపీ బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌ హెచ్చరించారు. పట్టణ పొన్నాలమ్మ కల్యాణ మండపంలో సోమవారం సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగురాష్ట్రాల్లో బీసీలుగా కొనసాగుతున్న పలు కులాలను, ఇతర రాష్ట్రాల తరహాలో ఎస్టీ, ఎస్సీ కేటగిరీ కింద చేర్చాలని స్పష్టం చేశారు. ర్యాంకులతో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకు పూర్తీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. 50 శాతం నామినేటెడ్‌ పదవులను బీసీలకు కేటాయిస్తూ నూతనచట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. బీసీ హక్కుల సాధన కోసం కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధమని హెచ్చరించారు. బీసీల సంక్షేమానికి సంబంధించి పదిరకాల డిమాండ్లను నెరవేర్చకుంటే ఈనెల 14న తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సంఘ నేతలు రామాచార్యులు, వడ్లతాంగల్‌ బాలాజీప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:44:21+05:30 IST