బొకేలు, గిఫ్టులు తేవద్దు

ABN , First Publish Date - 2021-02-06T08:45:31+05:30 IST

‘బొకేస్‌, గిఫ్ట్స్‌ నాట్‌ అలౌడ్‌..’ ఇదీ చిత్తూరు కలెక్టరేట్‌ గోడకు అతికించిన నోటీసు

బొకేలు, గిఫ్టులు తేవద్దు

 ‘బొకేస్‌, గిఫ్ట్స్‌ నాట్‌ అలౌడ్‌..’ ఇదీ చిత్తూరు కలెక్టరేట్‌ గోడకు అతికించిన నోటీసు. మూడు రోజుల కిందట కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరినారాయణన్‌ ఈ నోటీసు పెట్టించారు. తనను కలవడానికి వచ్చే అధికారులు, ఇతరలు బొకేలు, గిఫ్టులు తేవద్దని స్పష్టంచేశారు. దీంతో శుక్రవారం కొందరు నగర ప్రముఖులు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బొకేలు, గిఫ్ట్‌ ప్యాకెట్లతో వచ్చినా బయటేపెట్టి కలెక్టర్‌ను కలిశారు. మరోవైపు బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సమావేశానికి  గంట ఆలస్యంగా వచ్చిన ఓ మహిళా అధికారిణిని వెనుదిరిగి వెళ్లాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

- చిత్తూరు కలెక్టరేట్‌

Updated Date - 2021-02-06T08:45:31+05:30 IST