అనుమతిలేని వారికి ‘ఆక్సిజన్‌’ సిలిండర్లు ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2021-05-05T06:52:06+05:30 IST

అనుమతి లేనివారికి ఆక్సిజన్‌ సిలిండర్లు ఇవ్వరాదని కలెక్టర్‌ హరినారాయణన్‌ డీలర్లకు స్పష్టంచేశారు.

అనుమతిలేని వారికి ‘ఆక్సిజన్‌’ సిలిండర్లు ఇవ్వొద్దు

తిరుపతి (వైద్యం), మే 4: అనుమతి లేనివారికి ఆక్సిజన్‌ సిలిండర్లు ఇవ్వరాదని కలెక్టర్‌ హరినారాయణన్‌ డీలర్లకు స్పష్టంచేశారు. ఇళ్లకు ఇస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుపతిలో మంగళవారం ఆయన ఆక్సిజన్‌ సరఫరాచేసే కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ‘50 సిలిండర్లు ఉన్నాయి. గతంలో ఇక్కడే ఫిల్‌ చేసేవాళ్లం. డిమాండ్‌ కారణంగా చెన్నై నుంచి తేవడం ఇబ్బందిగా ఉంది’ అని మధు అన్నారు. 300 సిలిండర్లకు గాను 100 ఫిల్‌ చేసి ఎర్రగుంట్ల నుంచి వస్తున్నాయన్నారు. 300కి గాను 100 ఫిల్‌ చేసి ఎర్రగుంట్ల నుంచి సిలిండర్లను తెస్తున్నట్టు స్వాతి తెలిపారు. హిందూపురం నుంచి అవకాశం ఉందని, అక్కడోసారి పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వం నుంచీ ఇస్తున్నందున రోగుల అవసరాలకు తగ్గట్టుగా అందించాలని కోరారు. ఈ సమావేశంలో జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బాలాంజనేయులు,  ఆక్సిజన్‌ నోడల్‌ అధికారి డీఐసీ ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ భవాని, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కీర్తన ఉన్నారు. 

Updated Date - 2021-05-05T06:52:06+05:30 IST