‘ఉద్యోగాలు తొలగించడం అమానుషం’
ABN , First Publish Date - 2021-12-15T06:38:43+05:30 IST
ఉన్నఫళంగా ఉద్యోగాల నుంచి తమను తొలగించడం అమానుషమని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్కిట్ ఉద్యోగుల ఆవేదన
శ్రీకాళహస్తి, డిసెంబరు 14: ఉన్నఫళంగా ఉద్యోగాల నుంచి తమను తొలగించడం అమానుషమని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. పలువురు మాట్లాడుతూ.. స్కిట్ ఇంజ నీరింగ్ కళాశాలకు గతంలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్నట్లు వెల్లడించారు. కళాశాలలో 31 మంది బోధన, 36 మంది బోధనే తర సిబ్బంది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 31వతేదీకల్లా కళాశాలను మూసివేస్తున్నట్లు నోటీసులు అందాయని చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయం చూపాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. కాగా, పదిరోజుల్లోపు కళాశాలను తమ అధీనంలోకి తెస్తున్నట్లు ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇక్కడ చదివే 15మంది బీటెక్, 12మంది డిప్లమో విద్యార్థులను సమీప కళాశాలలకు తరలిస్తున్నట్లు వివరించారు.