దిశ చట్టం అమలు ఓ బూటకం

ABN , First Publish Date - 2021-08-21T06:19:46+05:30 IST

దిశ చట్టం అమలు ఓ బూటకమని శ్రీకాళహస్తిలో తెలుగు మహిళలు, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నిరసన తెలిపారు.

దిశ చట్టం అమలు ఓ బూటకం
తెలుగు మహిళలు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకుల ఆందోళన

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 20: రాష్ట్రంలో దిశ చట్టం అమలు బూటకంగా మారిందని తిరుపతి పార్లమెంట్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం పట్టణ పెండ్లిమండపం కూడలి వద్ద తెలుగు మహిళ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా మహిళలపై జరగనన్ని అఘాయిత్యాలు ఏపీలో జరుగుతున్నాయని ఆరోపించారు. దిశ చట్టం ద్వారా బాధిత మహిళలకు మూడువారాల్లో న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇంటి సమీపంలో రమ్యను హత్యచేసిన మృగాడిని ఎన్ని రోజుల్లో శిక్షిస్తారో పాలకులు తేల్చిచెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన మరవక ముందే గుంటూరులో ఓ బాలికపై సామూహిక అత్యాచారయత్నం జరగడం దారుణమన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని సీఎం రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో జనం ఆలోచించుకోవాలని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ, తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు గాలి చలపతి నాయుడు, దశరథాచారి, రవి, హేమంత్‌ రాయల్‌, విజయకుమార్‌, గాలి మురళీ నాయుడు, కంఠా రమేష్‌, రెడ్డివారి గురవారెడ్డి, సుమతి, సరోజమ్మ, షఫి, మణి, అస్మత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T06:19:46+05:30 IST