తప్పడు కేసులతో టీడీపీని అణచలేరు

ABN , First Publish Date - 2021-11-06T05:19:55+05:30 IST

తప్పుడు కేసులతో టీడీపీ శ్రేణులను అణచివేయలేరని, తప్పుడు కేసులు, దౌర్జన్యాలపై త్వరలో నియోజకవర్గ వ్యాపంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి వెల్లడించారు.

తప్పడు కేసులతో టీడీపీని అణచలేరు
సోమల నాయకులతో మాట్లాడుతున్న చల్లా రామచంద్రారెడ్డి

 త్వరలో పుంగనూరులో నిరసనలు 

 చల్లా రామచంద్రారెడ్డి 

పుంగనూరు, నవంబరు 5: తప్పుడు కేసులతో టీడీపీ శ్రేణులను అణచివేయలేరని, తప్పుడు కేసులు, దౌర్జన్యాలపై త్వరలో నియోజకవర్గ వ్యాపంగా  నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు.  టీడీపీ సోమల మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడుపై వైసీపీ నేతలు పోలీసుల ద్వారా హత్యాయత్నం, తప్పుడు కేసులు పెట్టడంపై ఆయన ఖండించారు. సోమల మండలం కందూరులో జరిగిన స్వల్ప తగాదాలో ఎస్‌ఐ, కొందరు అధికారులు వైసీపీ తొత్తులుగా మారి ఏమాత్రం సంబంధం లేకున్నా టీడీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. కేవలం చంద్రబాబు మీటింగ్‌కు వెళ్లారని హత్యాహత్నం కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళుతామన్నారు. టీడీపీ నాయకులకు,, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. కాగా పలువురు సోమల మండలం నాయకులు తనను కలిసి ఈ తప్పుడు కేసుల గురించి చెప్పారని వారికి మనోదైర్యం కల్పించినట్లు ఆయన వివరించారు. 

Updated Date - 2021-11-06T05:19:55+05:30 IST