డీ.ఎడ్ మూడో సెమిస్టర్ పరీక్షలు 22కు వాయిదా
ABN , First Publish Date - 2021-07-08T06:31:25+05:30 IST
2019-21 బ్యాచ్ డీఎడ్ రెగ్యులర్ విద్యార్థులకు 12 నుంచి జరగాల్సిన ఽథర్డ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22కు వాయిదా పడినట్లు డీఈవో పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు (సెంట్రల్), జూలై 7: 2019-21 బ్యాచ్ డీఎడ్ రెగ్యులర్ విద్యార్థులకు 12 నుంచి జరగాల్సిన ఽథర్డ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22కు వాయిదా పడినట్లు డీఈవో పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 22 నుంచి 28వ తేదీ వరకు రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. 22న ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవల్-1, 23న ఈవీఎస్ అట్ ప్రైమరీ లెవల్-2, 24న ఎలిమెంటరీ లెవల్ ఆప్షనల్ సబ్జెక్ట్-1, 26న ఎడ్యుకేషన్ ఇన్ కాన్‌టెంపరరీ ఇండియా-1, 27న ఇంటిగ్రేటింగ్ జండర్ అండ్ ఇన్‌క్ట్యూసివ్ ప్రాస్పెక్ట్యూవ్ ఇన్ ఎడ్యుకేషన్, 28న స్కూల్ కల్చర్, లీడర్‌షిప్ అండ్ టీచర్ డెవల్‌పమెంట్ సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి.