బావిలోదూకిన బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-06-22T07:08:05+05:30 IST

వ్యవసాయ బావిలో ఈత కొడుతున్న పిల్లలను చూసి.. తానూ బావిలోకి దూకాడు. ఈత రాకపోవడంతో పవన్‌సాయి (15) మృతిచెందాడు.

బావిలోదూకిన బాలుడి మృతి
పవన్‌సాయి (ఫైల్‌ఫొటో)

పాకాల, జూన్‌ 21: వ్యవసాయ బావిలో ఈత కొడుతున్న పిల్లలను చూసి.. తానూ బావిలోకి దూకాడు. ఈత రాకపోవడంతో పవన్‌సాయి (15) మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఆదివారం పాకాల మండలం రవణయ్యగారిపల్లె సమీపంలో జరిగింది. తిరుపతి పెరుమాళ్లపల్లెకు చెందిన ప్రశాంత్‌ కుమారుడు పవన్‌సాయి రవణయ్యగారిపల్లెలో బంధువుల ఇంటికి ఆదివారం వచ్చాడు. మధ్యాహ్నం సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు ఈత కోసం స్నేహితులతో కలిసి వెళ్లాడు. స్నేహితులు ఈత కొడుతుండగా తానూ బావిలో దూకేశాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. బంధువుల ఫిర్యాదుతో పాకాల పోలీసులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది బావి వద్దకు చేరుకుని గాలించారు. బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో మోటారు పంపుల సాయంతో నీళ్లు తోడడంతో మృతదేహం కనిపించింది. అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ కె.విశ్వనాఽథం, సిబ్బంది మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం బయటికి తీశారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-22T07:08:05+05:30 IST