అబ్బురపరిచిన నాట్య ప్రదర్శన

ABN , First Publish Date - 2021-11-29T06:07:20+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో జరిగిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అబ్బురపరిచాయి.

అబ్బురపరిచిన నాట్య ప్రదర్శన
నృత్యం చేస్తున్న కళాకారులు

శ్రీకాళహస్తి. నవంబరు 28: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో జరిగిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అబ్బురపరిచాయి. అనంతపురానికి చెందిన శ్రీగురుకృప సంగీత, నృత్య కళానికేతన్‌ గురువు పట్నం శివప్రసాద్‌ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శనలిచ్చారు. లాలిత్య, ప్రజ్వల, కృష్ణశ్రీ, మీరాగోపాల్‌, లిఖిత, సోమనాథ్‌ భరద్వాజ్‌, మనోజ్ఞ చేసిన నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్‌, సూపరింటెండెంట్‌ విజయసారథి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T06:07:20+05:30 IST