పంట నష్టం రూ.17.29 కోట్లు
ABN , First Publish Date - 2021-12-16T05:29:45+05:30 IST
జిల్లా వ్యాప్తంగా నవంబరులో కురిసిన వర్షానికి జరిగిన పంట నష్టం రూ.17.29 కోట్లుగా తేల్చినట్లు జేసీ (అభివృద్ధి) శ్రీధర్, వ్యవసాయ శాఖ జేడీ దొరసాని తెలిపారు

ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 15: జిల్లా వ్యాప్తంగా నవంబరులో కురిసిన వర్షానికి జరిగిన పంట నష్టం రూ.17.29 కోట్లుగా తేల్చినట్లు జేసీ (అభివృద్ధి) శ్రీధర్, వ్యవసాయ శాఖ జేడీ దొరసాని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ద్వారా లెక్కలు కట్టి మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు ద్వారా ఆమోదించిన నివేదికలను సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించి తుది జాబితా, నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. పంట నష్టం పూర్తి నివేదికను బుధవారం విడుదల చేశారు. జిల్లాలోని 36,295 మంది రైతులు 28,420 ఎకరాల్లో సాగు చేసిన వివిధ రకాల పంటలు నష్టం రూ.17.29 కోటు ఉందమన్నారు.
పంట నష్టం వివరాలు ఇలా ఉన్నాయి...
----------------------------------------------------------------
పంట పేరు నష్టం (ఎకరాల్లో..) రైతుల సంఖ్య
---------------------------------------------------------------------
వరి 24,487.5 31,807
వేరుశెనగ 1,252.5 1187
చెరకు 175 196
రాగి 332.5 441
కందులు 52.5 66
మొక్కజొన్న 415 402
ఇతర పంటలు 15 20
ఇసుక మేట 1100 1274
నేల కోత 590 902
--------------------------------------------------------------------
మొత్తం 28,420 36,295
------------------------------------------------------------------------