బొజ్జల కుటుంబంపై విమర్శలు తగవు: టీడీపీ
ABN , First Publish Date - 2021-10-20T05:35:35+05:30 IST
బొజ్జల కుటుంబంపై వైసీపీ వ్యక్తిగతఽ విమర్శలు, దూషణలు తగవని టీడీపీ నాయకులు తేల్చిచెప్పారు.

శ్రీకాళహస్తి, అక్టోబరు 19: బొజ్జల కుటుంబంపై వైసీపీ వ్యక్తిగతఽ విమర్శలు, దూషణలు తగవని టీడీపీ నాయకులు తేల్చిచెప్పారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య మాట్లాడుతూ.. శ్రీకాళహస్తికి వంద పడకల ప్రభుత్వాస్పత్రి మంజూరు చేయించిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిదే అన్నారు. మైనార్టీ నేత షాకీరాలీ మాట్లాడుతూ... టీడీపీ హయాంలో దుల్హన్ పథకం కింద ఎంతోమంది ముస్లిం కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టడం వైసీపీకే చెల్లుతుందన్నారు. మాజీ పురపాలక సంఘ వైస్ చైర్మన్ మిన్నల రవి మాట్లాడుతూ రాజకీయ కక్షతో దివంగత మాజీ పురపాలక సంఘ చైర్మన్ రాధారెడ్డి కుటుంబసభ్యుల క్రషర్ వ్యాపారాన్ని అణచివేయడం తగదన్నారు. ఈ అన్యాయాన్ని వన్నెరెడ్డి సామాజికవర్గ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. శ్రీకాళహస్తి సహకార పాల సరఫరా సంఘ చైర్మన్ మునిరాజా నాయుడు మాట్లాడుతూ... ప్రజల పక్షాన ప్రశ్నించిన సుధీర్‌రెడ్డి ని దూషించడం సబబుకాదన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, పార్టీ నాయకులు దశరథాచారి, చక్రాల ఉష, ప్రమీలమ్మ, విజయకుమార్, కంఠా రమేష్, చెంచయ్య నాయుడు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.