మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-01-07T05:10:00+05:30 IST
మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎంజేఎస్‌ఎస్ సభ్యులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వళవన్ వినతిపత్రం అందజేశారు.
ఎంజేఎస్‌ఎస్ ప్రతినిధుల వినతి
మదనపల్లె అర్బన్, జనవరి 6: మదనపల్లె జిల్లా ఏర్పాటు ఆవశ్యకత, ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించాలని మదనపల్లె జిల్లా సాధన సమితి(ఎంజేఎస్‌ఎస్) కన్వీనర్ శ్రీచందు తదితరులు విన్నవించారు. ఈ సంఘ సభ్యులు బుధవారం అమరావతిలో జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వళవన్‌ను కలిసారు. ఈ సందర్భంగా మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం నిర్విరామంగా కొనసాగుతున్న ఉద్యమాల గురించి ఎంజేఎస్‌ఎస్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వంపై అదనపు భారం పడదన్న విషయం గుర్తుచేశారు. కరికాల వళవన్ స్పందిస్తూ.. మదనపల్లె జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఏంజేఎస్‌ఎస్ సభ్యులు మనోహర్‌రెడ్డి, భరత్‌కుమార్, జయశంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.