విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి

ABN , First Publish Date - 2021-10-14T05:48:28+05:30 IST

విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతిచెందిన సంఘటన బుధవారం శ్రీకాళహస్తిలో జరిగింది.

విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మృతిచెందిన ఆవు

శ్రీకాళహస్తి, అక్టోబరు 13: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతిచెందిన సంఘటన బుధవారం పట్టణంలో జరిగింది. స్థానిక భాస్కరపేటకు చెందిన రమణమ్మ పాడి ఆవుపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. బుధవారం ఆవు ఇదే ప్రాంతంలోని చాముండేశ్వరి ఆలయం వెనుకున్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మేత మేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. కాగా, ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు రెండు ఆవులు విద్యుదాఘాతంతో మృతిచెందాయనీ, దీంతో తాను తీవ్రంగా నష్టపోయినట్లు రమణమ్మ వాపోయింది. అనంతరం ఏఈడీ జయప్రకాష్‌ ఘట నా స్థలానికి చేరుకుని వదులుగా ఉన్న విద్యుత్తు తీగలను సరిచేయించారు. ఏడీ నరసింహులు సిబ్బందితో కలసి ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయించారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-14T05:48:28+05:30 IST