ఆరుగురు సభ్యలతో కొవిడ్‌ గ్రామ కమిటీలు

ABN , First Publish Date - 2021-05-03T04:11:45+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని 1412 పంచాయతీలకు ఆరుగురు సభ్యులతో కూడిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీపీవో దశరథరామిరెడ్డి తెలిపారు.

ఆరుగురు సభ్యలతో కొవిడ్‌ గ్రామ కమిటీలు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 2: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని 1412 పంచాయతీలకు ఆరుగురు సభ్యులతో కూడిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీపీవో దశరథరామిరెడ్డి తెలిపారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, మహిళా పోలీస్‌, వలంటీర్లు సభ్యులుగా ఉంటారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆ రోగిని కొవిడ్‌ సెంటర్‌కు తరలిస్తారు. 21 మంది ప్రైమరీ, సెకండరీకాంటాక్టులను గుర్తించి అవసరమైతే ఆస్పపత్రులకు తరలిస్తారు. ఈ వివరాలను యాప్‌లను అప్‌లోడ్‌ చేయాలని కార్యదర్శులను ఆదేశించామని డీపీవో తెలిపారు.

Updated Date - 2021-05-03T04:11:45+05:30 IST