ప్రభుత్వ ఆస్పత్రిలోనే కరోనా వైద్యం

ABN , First Publish Date - 2021-05-18T05:45:10+05:30 IST

పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలియజేశారు.

ప్రభుత్వ ఆస్పత్రిలోనే కరోనా వైద్యం
పుంగనూరు ఆసుపత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణ్‌

పుంగనూరు రూరల్‌, మే 17: పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నట్లు  కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఆయన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జేసీ రాజశేఖర్‌, మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవిలతో కలసి పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రి కొవిడ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చామన్నారు. 100పడకలను ఏర్పాటు చేసి 150 ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను  అందుబాటులో ఉంచు తున్నట్లు తెలిపారు. ఆస్పత్రికి అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో పరికరాలు పంప నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో పెంచు లయ్య, కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ చిరిమిళ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీంబాషా, వైసీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, నాగభూషణం, వెంకటరెడ్డియాదవ్‌, చంద్రారెడ్డియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T05:45:10+05:30 IST