2670 కరోనా కేసులు... 8 మరణాలు

ABN , First Publish Date - 2021-05-20T06:18:21+05:30 IST

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 2670 కరోనా పాజిటివ్‌ కేసులు, ఎనిమిది మరణాలూ నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ బులెటిన్‌ వెల్లడించింది.

2670 కరోనా కేసులు... 8 మరణాలు

తిరుపతి, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 2670 కరోనా పాజిటివ్‌ కేసులు, ఎనిమిది మరణాలూ నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ బులెటిన్‌ వెల్లడించింది. తాజా కేసులతో జిల్లాలో కేసుల సంఖ్య 163858కు చేరుకోగా బుధవారం ఉదయానికి 23336 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు గుర్తించారు. ఇక మరణాల సంఖ్య 1122కు పెరిగింది.తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 262, మదనపల్లెలో 212, చిత్తూరులో 186, పలమనేరులో 134, వి.కోటలో 100 వున్నాయి. పీలేరులో 97, శ్రీకాళహస్తిలో 96, తిరుపతి రూరల్‌లో 91, కుప్పంలో 90, పుంగనూరులో 77, తవణంపల్లెలో 62, చంద్రగిరిలో 50, పెద్దపంజాణిలో 48, పుత్తూరులో 45, చిన్నగొట్టిగల్లు, రామకుప్పం మండలాల్లో 42 వంతున, రేణిగుంట, రొంపిచెర్ల మండలాల్లో 40 చొప్పున, కలికిరి, కురబలకోట మండలాల్లో 39 చొప్పున, పులిచెర్లలో 35, గంగవరం, గుర్రంకొండ, కలకడ, కేవీపల్లె, ఏర్పేడు మండలాల్లో 32 చొప్పున, ఐరాల, నారాయణవనం మండలాల్లో 31 చొప్పున, చౌడేపల్లె, శాంతిపురం, సోమల మండలాల్లో 30 చొప్పున, జీడీనెల్లూరులో 29, గుడుపల్లెలో 28, ములకలచెరువులో 27, బంగారుపాలెంలో 26, వాల్మీకిపురం, నగరి మండలాల్లో 25 చొప్పున, పెద్దమండ్యంలో 23, రామసముద్రంలో 21, పాకాలలో 20, కార్వేటినగరం, తంబళ్ళపల్లె మండలాల్లో 19 చొప్పున, నిమ్మనపల్లె, పూతలపట్టు మండలాల్లో 18 వంతున, వెదురుకుప్పంలో 17, నాగలాపురం, వడమాలపేట మండలాల్లో 16 వంతున, బైరెడ్డిపల్లె, యాదమరి మండలాల్లో 15 చొప్పున, సదుంలో 14, నిండ్ర, పెనుమూరు మండలాల్లో 13 వంతున, సత్యవేడులో 12, బి.కొత్తకోట, పీటీఎం, పిచ్చాటూరు, ఎర్రావారిపాలెం మండలాల్లో 10 వంతున, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, వరదయ్యపాలెం మండలాల్లో 8 వంతున, గుడిపాల, తొట్టంబేడు మండలాల్లో 6 చొప్పున, బీఎన్‌ కండ్రిగ, విజయపురం మండలాల్లో 4 చొప్పున, కేవీబీపురంలో 2 వంతున నమోదయ్యాయి.


మృతుల్లో సర్పంచ్‌ సహా ప్రభుత్వ ఉద్యోగులు


సత్యవేడు మండలం ఎన్‌ఆర్‌ అగ్రహారం పంచాయతీ సర్పంచ్‌ రామాంజులు (53) కరోనా సోకడంతో తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. చిత్తూరుకు చెందిన విజయ్‌కుమార్‌ (58) పలమనేరు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని కర్నాటక సరిహద్దు చెక్‌పోస్టులో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. కొవిడ్‌ సోకిన కారణంగా తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బుధవారం ఉదయం మరణించారు. పలమనేరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జయప్ప (50) కూడా కరోనాతో తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆరోగ్యం మెరుగుపడిందని, డిశ్చార్జి చేస్తున్నామంటూ వైద్యులు మంగళవారం చెప్పారు. ఇంటికి వెళ్ళేందుకు సిద్ధపడుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణించారు. వెదురుకుప్పం మండలం తిప్పినాయుడుపల్లెకు చెందిన నాగరాజు పిళ్ళై (55) చిత్తూరు మండలం పచ్చనపల్లె మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన కరోనా సోకడంతో ఈ నెల 13వ తేది తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటూ బుధవారం మరణించారు. అలాగే తిరుపతి మంగళం ప్రాంతంలోని సప్తగిరి కాలనీ పంచాయతీలో హెబ్రాన్‌ ప్రేయర్‌ హౌస్‌ పేరిట చర్చి నిర్వహిస్తున్న పాస్టర్‌ శౌరి (48) కరోనా సోకడంతో క్వారంటైన్‌లో వుుండి ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. బుధవారం ఇంట్లో వుండగా గుండెపోటు రావడంతో మృతిచెందారు.

Updated Date - 2021-05-20T06:18:21+05:30 IST