కరోనా బాధితులకు బాసట

ABN , First Publish Date - 2021-05-20T05:43:28+05:30 IST

శ్రీకాళహస్తి శివసదన్‌లోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రారంభించారు.

కరోనా బాధితులకు బాసట
కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ గురుమూర్తి

 శ్రీకాళహస్తి, మే 19: కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. పట్టణ సన్నిధివీధిలోని శివసదన్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ... కొవిడ్‌ నివారణకు ప్రజలు సహకరించాలనీ, స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే బియ్యపు మఽధుసూదనరెడ్డి మాట్లాడుతూ... కరోనా లక్షణాలున్న బాధితులు ఆందోళన చెందకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌ లేదా ఆస్పత్రిలో చికిత్సలు పొందాల్సి ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజశేఖర్‌, ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు, తహసీల్దార్‌ ఉదయ్‌ సంతోష్‌, ఎంపీడీవో బాలాజీ నాయక్‌, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌ చంద్రమోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి కమిషనర్‌ వెంకట్రమణ, డాక్టర్‌ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-20T05:43:28+05:30 IST