స్వచ్ఛత వాహనాలకు తుప్పు... ఎవరిది తప్పు?

ABN , First Publish Date - 2021-07-12T05:52:47+05:30 IST

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మరంగా తలపెట్టిన స్వచ్చభారత్‌ కార్యక్రమానికి చుక్కెదురైంది. గ్రామాలు, వీధుల్లో చెత్త సేకరణ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి పంచాయతీలకు అందించిన ఆటో రిక్షాలు, బ్యాటరీ వాహనాలు తుప్పుపడుతున్నాయి.

స్వచ్ఛత వాహనాలకు తుప్పు... ఎవరిది తప్పు?
పాత పశువైద్యశాల ఆవరణంలో తుప్పుపడుతున్న చెత్తసేకరణ పరికరాలు

మూలనపడ్డ చెత్త సేకరణ యంత్రాలు 


ములకలచెరువు, జులై 11: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మరంగా తలపెట్టిన స్వచ్చభారత్‌ కార్యక్రమానికి చుక్కెదురైంది. గ్రామాలు, వీధుల్లో చెత్త సేకరణ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి పంచాయతీలకు అందించిన ఆటో రిక్షాలు, బ్యాటరీ వాహనాలు తుప్పుపడుతున్నాయి. చెత్తను సేకరించి చెత్తతో సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు కేంద్రం ఆటో రిక్షాలు, బ్యాటరీ వాహనాలను మూడేళ్ల క్రితం పంచాయతీలకు అందించింది. చెత్త సేకరణ కోసం కొన్ని రోజులు వీటిని వినియోగించారు. తరువాత మూలన పడేశారు. ములకలచెరువు గ్రామ సచివాలయం ముందు రెండు బ్యాటరీ ఆటోలు, పాత పశువైద్యశాల ఆవరణలో చెత్త సేకరణ వాహనాలు తుప్పుపడుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తుప్పుపడుతున్న చెత్తసేకరణ వాహనాలను వినియోగంలోకి తెచ్చి ప్రజా ధనం వృథా కాకుండా చూడాలని గ్రామీణులు కోరుతున్నాయి. 



Updated Date - 2021-07-12T05:52:47+05:30 IST