కౌంటింగ్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-02T06:58:55+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శనివారం కరోనా పరీక్షలు చేపట్టారు.

కౌంటింగ్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు
శ్వాబ్‌ నమూనా తీసుకుంటున్న వైద్య సిబ్బంది

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 1: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శనివారం కరోనా పరీక్షలు చేపట్టారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియం వద్ద ఈ పరీక్షలు జరిగాయి. 48 గంటల్లోపు టెస్టు చేసుకున్న కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు లేదా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్న ధ్రువీకరణ పత్రం ఉంటేనే సిబ్బందిని కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించనున్నారు. కౌంటింగ్‌ సరళిపై కవరేజీకి వెళ్లే మీడియా ప్రతినిధులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-02T06:58:55+05:30 IST