82మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-10-29T06:54:15+05:30 IST

జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 82 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాగా అదే వ్యవధిలో కొవిడ్‌తో జిల్లాలో మరణాలేవీ సంభవించలేదు.

82మందికి కరోనా పాజిటివ్‌

తిరుపతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 82 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాగా అదే వ్యవధిలో కొవిడ్‌తో జిల్లాలో మరణాలేవీ సంభవించలేదు. కొత్తగా గుర్తించిన కేసులతో జిల్లాలో కేసుల సంఖ్య 246728కు పెరిగింది. కాగా గురువారం జిల్లాలో 911 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వ అధికారిక బులెటిన్‌ వెల్లడించింది. కొత్తగా నిర్ధారించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 27, చిత్తూరులో 16, మదనపల్లెలో 4, తిరుపతి రూరల్‌, కలికిరి, వాల్మీకిపురం, వెదురుకుప్పం మండలాల్లో 3 వంతున, పుత్తూరు, పలమనేరు, చిన్నగొట్టిగల్లు, పీలేరు, ఐరాల, పెనుమూరు మండలాల్లో 2 చొప్పున, కలకడ, పూతలపట్టు, తవణంపల్లె, కేవీపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు, బంగారుపాలెం, గుర్రంకొండ, యాదమరి, శ్రీరంగరాజపురం, నాగలాపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-29T06:54:15+05:30 IST