చిగురువాడలో అంతులేని విషాదం

ABN , First Publish Date - 2021-05-05T15:32:25+05:30 IST

తిరుపతి రూరల్‌ మండలం చిగురువాడలో..

చిగురువాడలో అంతులేని విషాదం

కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి


తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం చిగురువాడలో తీవ్ర విషాదం నెల కొంది. కరోనాతో ఒకే కుటుంబంలో తల్లీతండ్రి, కుమారుడు మృతి చెందారు. గత నెల 29న భార్యాభర్తలు మృతి చెందారు. నాలుగు రోజు లు తిరక్కుండానే వారి కుమారుడు కూడా కరోనాతో కన్నుమూశాడు. గ్రామానికి చెందిన ఎ. గెరిటారెడ్డి (64), ఆయన భార్య ఎ.సులోచ నమ్మ(56), కుమారుడు ఎ.దివాకర్‌ రెడ్డి (28) వరుసగా మృతి చెందారు. తొలుత గెరిటారెడ్డి, అదే రోజు ఆయన భార్య సులోచనమ్మ మృతి చెందారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన కుమారుడు దివాకర్‌రెడ్డి తిరు పతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. నాలుగు రోజు ల్లోనే తల్లీ, తండ్రీ, సోదరుడిని కోల్పోయి న ఒక్కగానొక్క కుమారైను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలాగే చిగురు వాడ హరిజనవాడకు చెందిన కె.మధు (41) పది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ నెల 1న  పాజిటివ్‌ వచ్చిం ది. ఈక్రమంలో తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం మృతి చెందారు. మధుకు భార్య,  కుమార్తె ఉన్నారు. మధు మృతి పట్ల  సర్పంచ్‌  ఎం.ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-05T15:32:25+05:30 IST