మరో 23మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-12T06:51:56+05:30 IST

జిల్లాలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.

మరో 23మందికి కరోనా

తిరుపతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అలాగే యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 190 ఉన్నట్లు అధికారిక బులెటిన్‌లో ప్రభుత్వం ప్రకటించింది. తాజా కేసులతో కలిపి  ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 89274కు చేరుకుంది. కొత్తగా గుర్తించిన 23 కేసులు.. తిరుపతి నగరంలో 10, తిరుపతి రూరల్‌ మండలంలో 5, పుత్తూరులో 2, కలకడ, కేవీపల్లె, మదనపల్లె, పాకాల,          రేణిగుంట, రొంపిచెర్ల మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. గడచిన 6 రోజులుగా జిల్లాలో కొవిడ్‌ మరణాలేవీ సంభవించలేదు.


కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం.. నేటి రాత్రిలోపు నమోదు చేసుకోండి

చిత్తూరు రూరల్‌, జనవరి 11: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే హెల్త్‌ కేర్‌ వర్కర్లు ఇంకా ఎవరైనా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకోకుంటే మంగళవారం రాత్రిలోపు ‘కొవిన్‌’ యాప్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయాలని ఏపీ మెడికల్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ భాస్కర్‌ సూచించారు. సోమవారం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కోసం జిల్లాలో 29 సెషన్‌ కేంద్రాల ఎంపిక చేసినట్లు చెప్పారు. డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమాదేవి, డీఐవో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో ఈ అంశంపై వైద్యఆరోగ్య శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

Updated Date - 2021-01-12T06:51:56+05:30 IST