ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-10-28T05:36:15+05:30 IST
మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారితో పాటు ముగ్గురు సిబ్బందికి కొవిడ్ నిర్ధరణ అయినట్టు సమాచారం.

మదనపల్లె రూరల్, అక్టోబరు 27: మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారితో పాటు ముగ్గురు సిబ్బందికి కొవిడ్ నిర్ధరణ అయినట్టు సమాచారం. దీంతో మిగతా సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. నిత్యం సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ సిబ్బందితో పాటు వందలమంది ప్రజలు వివిధ రకాల పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి వస్తుంటారు. కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ ఒకేసారి కార్యాలయంలో నలుగురికి పాజిటివ్ రావడంతో భయం మొదలైంది.