కరోనా కేసులు 64

ABN , First Publish Date - 2021-11-01T05:27:58+05:30 IST

జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 64 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

కరోనా కేసులు 64

తిరుపతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 64 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో కొవిడ్‌తో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 246935కు, కొవిడ్‌ మరణాలు 1947కి చేరాయి. ఆదివారం ఉదయానికి 844 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసులు.. తిరుపతి అర్బన్‌లో 17,  తిరుపతి రూరల్‌ 9, పీలేరు 7, చిత్తూరు అర్బన్‌ 4, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, పాకాల మండలాల్లో 3 చొప్పున, పలమనేరు, చినగొట్టిగల్లు, గుడుపల్లె మండలాల్లో 2 వంతున, శ్రీకాళహస్తి, యాదమరి, కలకడ, పుంగనూరు, వాల్మీకిపురం, తంబళ్లపల్లె, గంగవరం, యర్రావారిపాళెం మండలాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి. 

Updated Date - 2021-11-01T05:27:58+05:30 IST