రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

ABN , First Publish Date - 2021-11-09T07:14:20+05:30 IST

బి.కొత్తకోట-మదనపల్లె మార్గం కొత్తపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామమోహన్‌(55) అనే వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
రామమోహన్‌ (ఫైల్‌ఫొటో)

 బి.కొత్తకోట, నవంబర్‌ 8: బి.కొత్తకోట-మదనపల్లె మార్గం కొత్తపల్లె సమీపంలో   జరిగిన రోడ్డు ప్రమాదంలో రామమోహన్‌(55) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీ కొత్తపల్లెకు చెందిన రామమోహన్‌ ద్విచక్రవాహనంపై కొండ కిందపల్లె సమీపంలో పొలం పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి గ్రామానికి వస్తూ రోడ్డు క్రాస్‌ చేస్తుండగా  వెనుకవైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన మొగసాల మర్రి గ్రామానికి చెందిన మధుకర్‌ రెడ్డి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రామమోహన్‌ను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి  మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన మధుకర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బి.కొత్తకోట ఎస్‌ఐ రామ మోహన్‌ తెలిపారు.

Updated Date - 2021-11-09T07:14:20+05:30 IST