కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్
ABN , First Publish Date - 2021-03-02T06:07:18+05:30 IST
జిల్లాలో శ్రీకాళహస్తి మినహా మిగిలిన ఏడు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల కోసం కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సోమవారం ఏర్పాటు చేశారు.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 1: జిల్లాలో శ్రీకాళహస్తి మినహా మిగిలిన ఏడు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల కోసం కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, సమస్యలు, స్వీకరించేందుకోసం 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌లో టోల్ ఫ్రీ నెంబరు 08572-242744, 242433, 242734 నెంబర్లకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు.