భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-03-24T05:39:57+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వన భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు.

భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి
భారత్‌ బంద్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్న వామపక్ష నేతలు

 చిత్తూరు రూరల్‌, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక  వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వన భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి ఢిల్లీ పరిసరాల్లో పోరాటం చేస్తున్న లక్షలాది మంది రైతుల డిమాండ్లు అంగీ కరించి వెంటనే సాగు చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీపీఐ నాగ రాజన్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విరమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు చైతన్య, సురేంద్ర, గిడ్డుబాయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-24T05:39:57+05:30 IST